04/11/2026, Wednesday · 03:45:17 AM About UsPrivacy PolicyContact Us
Bhanu News

వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను

G. Prakash 28/10/2026 6:47 AM రాష్ట్ర వార్తలు 19

వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను
Want this news as a newspaper clip?Print News Clip
  • భూభాగాన్ని తాకుతున్న తుపాను బాహ్య వలయం.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

అమరావతి:

అర్నబ్ తుపాను వేగంగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకుతున్నట్లు తెలిపింది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తుపాను పూర్తిగా తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.

గడిచిన ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఈ అతి తీవ్ర తుపాను కదిలినట్లు అధికారులు తెలిపారు.

తీర ప్రాంతాలకు సమీపంలో తుపాను

తుపాను విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 90 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 170 కిలోమీటర్లు, బాపట్లకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.

పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో రేపు ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.

28 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు

ఈరోజు ఉదయం 8.30 గంటల నుంచి రాష్ట్రంలోని 28 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 133 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ వివరాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

ఇదీ చదవండి :: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి సమీక్ష.. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్!

Arnab cycloneFastmoving

About the author

G. Prakash

G. Prakash

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

44 Posts

Latest News

మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి సమీక్ష.. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్! తిరువూరులో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్లపై గుర్తులు తారుమారు! ఏపీలో మరో దారుణం.. పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడికటింగ్ మిషన్‌తో దాడి అర్నబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ బరిలో రెంటపల్లి నాగరాజు దూకుడు! యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి