04/11/2026, Wednesday · 03:45:18 AM About UsPrivacy PolicyContact Us
Bhanu News

అర్నబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

G. Prakash 28/10/2026 11:47 AM జాతీయం 18

అర్నబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
Want this news as a newspaper clip?Print News Clip
  • అర్ధరాత్రి 1.30 వరకు సమీక్ష.. ఉదయం 6.15కే మళ్లీ రంగంలోకి చంద్రబాబు!

అర్ధరాత్రి 1.30 వరకు సమీక్ష.. ఉదయం 6.15కే మళ్లీ రంగంలోకి చంద్రబాబు!

అర్నబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. 

తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

అర్ధరాత్రి 1.30 గంటల వరకు సమీక్షించిన సీఎం.. ఉదయం 6.15 గంటలకు మరోసారి అధికారులతో మాట్లాడారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. 

ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, ముందుజాగ్రత్తగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశామని వివరించారు.

తుపాన్ తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.

 చెరువులు, కాల్వలు పొంగిపొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

ఇదీ చదవండి :: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి సమీక్ష.. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్!

constantly monitoringChandrababusituationCycloneArnab

About the author

G. Prakash

G. Prakash

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

44 Posts

Latest News

మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి సమీక్ష.. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్! తిరువూరులో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్లపై గుర్తులు తారుమారు! ఏపీలో మరో దారుణం.. పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడికటింగ్ మిషన్‌తో దాడి వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ బరిలో రెంటపల్లి నాగరాజు దూకుడు! యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి