విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్లపై గుర్తులు తారుమారు!

- వైసీపీ అభ్యర్థి పేరు ఎదుట హస్తం గుర్తు.. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ముందు ఫ్యాన్ గుర్తు ముద్రణ
విజయవాడ: విజయవాడ నగరంలోని 55వ డివిజన్ ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల గుర్తులు తారుమారుగా ముద్రించబడటం కలకలం రేపుతోంది. వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరు ఎదుట హస్తం గుర్తు ముద్రించగా, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు ముందు ఫ్యాన్ గుర్తు ముద్రించినట్లు సమాచారం.
అయితే, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తూ గతంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) విడుదల చేసిన ఫారం-11లో మాత్రం అభ్యర్థుల పేర్లు, గుర్తులు సక్రమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫారం-11లో ఒక విధంగా, బ్యాలెట్ పేపర్లలో మరో విధంగా గుర్తులు ముద్రించడంపై అభ్యర్థులు, స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పొరపాటు ఎలా జరిగింది? గుర్తులు మారడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తులు మార్చారా? లేక ముద్రణలో పొరపాటు జరిగిందా? అన్న సందేహాలువ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ బాషా ఆర్ఓను సంప్రదించినట్లు సమాచారం. అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎన్నికల అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? అన్న అంశాలపై 55వ డివిజన్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బ్యాలెట్ పేపర్లలో గుర్తుల మార్పుపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఇదీ చదవండి :: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి సమీక్ష.. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్!













