ఏపీలో మరో దారుణం.. పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడికటింగ్ మిషన్‌తో దాడి

విద్యార్థినికి తీవ్ర గాయాలురాప్తాడు: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోనే పదో తరగతి విద్యార్థినిపై కటింగ్ మిషన్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో విద్యార్థినికి ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విద్యార్థినిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి.
పాఠశాల ఆవరణలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థినిపై దాడికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి :: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి సమీక్ష.. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్!











