Bhanu News
Date of Publish : 28/10/2026, 11:47 am
Published by G. Prakash

అర్నబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

  • అర్ధరాత్రి 1.30 వరకు సమీక్ష.. ఉదయం 6.15కే మళ్లీ రంగంలోకి చంద్రబాబు!

అర్ధరాత్రి 1.30 వరకు సమీక్ష.. ఉదయం 6.15కే మళ్లీ రంగంలోకి చంద్రబాబు!

అర్నబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. 

తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

అర్ధరాత్రి 1.30 గంటల వరకు సమీక్షించిన సీఎం.. ఉదయం 6.15 గంటలకు మరోసారి అధికారులతో మాట్లాడారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. 

ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, ముందుజాగ్రత్తగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశామని వివరించారు.

తుపాన్ తీవ్రత తగ్గిన తర్వాత విద్యుత్ పునరుద్ధరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.

 చెరువులు, కాల్వలు పొంగిపొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Bhanu News
PDF Share Save