Bhanu News
Date of Publish : 31/10/2026, 12:16 pm
Published by G. Prakash

ఏపీలో మరో దారుణం.. పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడికటింగ్ మిషన్‌తో దాడి

విద్యార్థినికి తీవ్ర గాయాలురాప్తాడు: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోనే పదో తరగతి విద్యార్థినిపై కటింగ్ మిషన్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో విద్యార్థినికి ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విద్యార్థినిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి.

పాఠశాల ఆవరణలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థినిపై దాడికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Bhanu News
PDF Share Save