ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పట్టణ పరిధిలో మొత్తం 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తిరువూరు జడ్పీ హైస్కూల్‌లో చేసిన ఏర్పాట్లను ఆర్డీవో ఏ. కుమార్ పరిశీలించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగించుకునేందుకువివిధకేంద్రాలకుచేరుకుంటున్నారు. తిరువూరు జడ్పీ హైస్కూల్, పట్టణంలోని ఉర్దూ పాఠశాల, శాంతినగర్ ఉర్దూ పాఠశాల, రాజుపేట (అప్పనాలపేట) ఎంపీపీ పాఠశాలల్లో ఓటర్లు బారులు తీరారు.వృద్ధులకు పోలీసుల సహాయంరాజుపేట (అప్పనాలపేట)లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కునువినియోగించుకునేందుకు వచ్చిన వృద్ధులకు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జీ. కృష్ణయ్యసహాయంఅందించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కునువినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పలువురు అభిప్రాయపడ్డారు.
పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు కొరతపై ఫిర్యాదులు
తిరువూరు సర్వోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని పోలింగ్ బూత్‌లలో లైటింగ్ వెలుతురు తక్కువగా ఉందని ఓటర్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తగిన వెలుతురు ఏర్పాట్లు చేయాలని కోరారు.ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దంపతులుతిరువూరు శాంతినగర్‌లోని ఉర్దూ పాఠశాల పోలింగ్ కేంద్రంలో నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామి దాస్ తన భార్య సుధారాణితో కలిసి ఓటుహక్కునువినియోగించుకున్నారు.పట్టణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటుహక్కునువినియోగించుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.