ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండల జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెంటపల్లి నాగరాజు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న తరుణంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
“అన్నా.. అక్కా.. చెల్లెమ్మా.. తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్” అంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని నాగరాజు ఓటర్లను కోరుతున్నారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న రెంటపల్లి నాగరాజు పర్యటనలతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఆయనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
